
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నారు. ఇవాళ సాయంత్రం నుండి రేపు ఉదయం లోపుగా ఉద్యోగుల బ్యాంకు అకౌంట్ లోకి జీతాలు జమ కానున్నాయి. గత మాసంలో జరిగిన శాసనమండలి సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపకుండానే శాసనమండలి వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్ధిక చెల్లింపులకు అడ్డంకులు తొలిగిపోగా,ప్రభుత్వ ఉద్యోగాల జీతాల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం నుండి రేపు ఉదయం నాటికీ ఉద్యోగులకు జీతాలు అందనున్నాయి.
కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి నెలలో వాయిదా వేసిన జీతాలు, గౌరవ వేతనాలు,పెన్షన్లను ఎట్టకేలకు డిసెంబర్ నెలలో చెల్లించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు ఏప్రిల్ నెలలో తగ్గించి ఇచ్చిన వేతనాలను కూడా డిసెంబర్ నెలలో , ఇంకా 2021 జనవరిలో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.