కొన‌సాగుతున్న‌ గ్రేటర్ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ!

December 4, 2020 at 10:04 am

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. ఈ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం ముప్పై కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ప్ర‌స్తుతం అన్ని కేంద్రాల్లోనూ జోరుజోరుగా ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది.

ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్‌ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. ఇప్పటి వరకు 55 డివిజన్‌లో బీజేపీ ముందంజలో ఉండగా.. 21 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ 4 స్థానాల్లో, ఎంఐఎం 10 స్థానాల్లో ముందంజ‌లో కొన‌సాగుతున్నాయి.

కాగా, ఈ నెల 1న 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 34,50,331 ఓట్లు పోలయ్యాయి. 1,926 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను అధికారులు జారీ చేశారు. మొదటి రౌండ్‌గా వీటిని తెరిచారు. 11 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది.

కొన‌సాగుతున్న‌ గ్రేటర్ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts