అంజ‌లి బోల్డ్ డెసిషన్ … షాక్‌లో అభిమానులు!!

December 5, 2020 at 6:16 pm

ఈ రోజుల్లో మన తెలుగమ్మాయిలు మేము ఎందులోనూ తక్కువ కాదంటు నిరూపిస్తున్నారు. ఫోటో సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యి, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ పెద్ద హీరోయిన్ అయిపోయింది అంజలి. తాజాగా అంజలి ఓ చిత్రంలో లెస్బియన్ పాత్రలో నటిస్తుంది. పావ కదైగాల్ అనే చిత్రం కోసం లెస్బియన్‌గా మారిపోయింది మన తెలుగమ్మాయి అంజలి. నలుగురు ప్రముఖ దర్శకులు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాని నయనతార లవర్ విఘ్నేష్ శివన్, గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్ కలిపి తెరకెక్కిస్తున్నారు. ఓటిటి ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, అంజలి, ప్రకాశ్ రాజ్, కల్కి కొచ్లిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాలుగు విభిన్నమయిన కథలను నలుగురు దర్శకులు కలిసి డైరెక్ట్ చేసారు. మొత్తానికి లెస్బియన్ పాత్ర చేస్తూ ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకున్న మన తెలుగమ్మాయి అంజలి ని అందరు మెచ్చుకుంటున్నారు.

అంజ‌లి బోల్డ్ డెసిషన్ … షాక్‌లో అభిమానులు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts