ఈసీకి హైకోర్టు షాక్.. ఆ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు!

December 4, 2020 at 10:48 am

గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఉద్రిక్తత తారస్థాయికి చేరిన ఈ మహా పోరులో అంతిమ విజయం ఎవ‌రిది అన్న ఉత్కంఠ రాష్ట్ర‌వ్యాప్తంగా కొన‌సాగుతోంది. అయితే ఈసారి పెన్నుతో టిక్ పెట్టిన ఓటు వేసినట్లే అంటూ ఎస్ఈసీ సర్య్కూలర్ జారీ చేసింది. స్వస్తిక్ ముద్ర తో పాటు ఏ గుర్తు ఉన్న ఓటు గా పరిగణించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది.

అయితే తాజాగా ఈసీ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తరువులు జారీ చేసింది. కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ పేపర్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, మరే విధమైన పద్ధతుల్లో ఓటేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

అలాగే వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు ఈ సమాచారాన్ని అందించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈసీ ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయిస్తూ, బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ పేపర్లు మాత్ర‌మే చెల్లుబాటు అవుతాయ‌ని తేల్చింది.

ఈసీకి హైకోర్టు షాక్.. ఆ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts