
మెగా స్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం `ఆచార్య`. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా అంతా దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ జరుగుతుందని తెలుస్తోంది.
ఇక లాక్డౌన్ తర్వాత ఇటీవలె షూటింగ్ ప్రారంభం అయింది. చిరంజీవి కూడా ఈ గురువారం హైదరాబాద్ శివారులో ఉన్న ఆచార్య సెట్లో అడుగు పెట్టి.. షూట్ షురూ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారట.
ఆ భారీ సెట్‌ను 16 ఎకరాల్లో ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెట్టి వేస్తున్నారట. ఈ సెట్లో మేజర్ షెడ్యూల్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశారట కొరటాల. ఏదేమైనా ఇరవై కోట్లతో సెట్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కాగా, ఇంతకుముందు కూడా ఓ ఆలయం కోసం నాలుగు కోట్లు ఖర్చు పెట్టారన్న సంగతి తెలిసిందే.