అన్నం పెట్ట లేదన్న కోపంతో భార్యను హతమార్చిన భర్త…!?

December 5, 2020 at 3:37 pm

హైదరాబాద్ న‌గ‌రంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి‌లో ఒక దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార్య జ‌య‌మ్మను తన భ‌ర్త శ్రీ‌నివాస్ గౌడ్ గొంతు నులిమి హత మార్చేశాడు అసలు ఏమి జరిగిందంటే, భార్య తనకు అన్నం పెట్ట‌లేదు అనే ఉక్రోషంతో భ‌ర్త శ్రీ‌నివాస్ గౌడ్ ఈ దారుణానికి ఒడి గ‌ట్టిన‌ట్లుగా తెలిసింది. శ్రీ‌నివాస్ గౌడ్ భార్య జ‌య‌మ్మ త‌న కొడుకుతో క‌లిసి ఓ పెళ్ళికి వెళ్లి వ‌చ్చింది. ఇంటికి వ‌చ్చిన తన భార్య‌ను శ్రీ‌నివాస్ గౌడ్ అన్నం పెట్టమని అడిగాడు.

కానీ అప్పుడే పెళ్లికి వెళ్లి రావటంతో అన్నం వండేందుకు ఆమె నిరాక‌రించింది. దానితో భ‌ర్త శ్రీ‌నివాస్ గౌడ్ .కి విపరీతమయిన కోపం రావటంతో తన భార్య జ‌య‌మ్మ మెడ‌కు చీర‌ను చుట్టి గొంతు నులిమి చంపేశాడు. ఆమె మృత ‌దేహాన్ని ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస్ గౌడ్ ప‌రారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నోమోదు చేసి శ్రీనివాసుని వెతుకుతున్నారు.

అన్నం పెట్ట లేదన్న కోపంతో భార్యను హతమార్చిన భర్త…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts