జగన్.. అభినవ అంబేద్కర్..?

December 3, 2020 at 2:56 pm

ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి అనే విషయం తెలిసిందే అయితే ఐదు రోజుల పాటు జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా విషయాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. గురువారం అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన పథకాల గురించి చర్చ జరిగింది ఈ సందర్భంగా పలువురు వైసిపి సభ్యులు ప్రభుత్వ పథకాలపై ప్రశంసలు కురిపించారు అయితే అసెంబ్లీ వేదికగా మాట్లాడిన వైసిపి ఎమ్మెల్యే ఉషశ్రీ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తీసుకుంటున్న నిర్ణయాల పై ప్రశంసల వర్షం కురిపించారు.

జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని అంటూ చెప్పుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించి… ఎస్టీ బిసి వర్గాల అభివృద్ధికి జగన్ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. నాడు అంబేద్కర్ కూడా ఎస్సీ ఎస్టీ బిసి వర్గాల అభివృద్ధికి కృషి చేశారని నేడు జగన్ అదే చేస్తున్నారని జగన్ ప్రస్తుతం అభినవ అంబేద్కర్గా మారారు అంటూ ప్రశంసలు కురిపించారు వైసీపీ ఎమ్మెల్యే ఉష శ్రీ.

జగన్.. అభినవ అంబేద్కర్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts