అమ్మఒడి లబ్ధిదారులకు శుభవార్త తెలిపిన జగన్ సర్కార్….!?

December 29, 2020 at 2:53 pm

జగన్ అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న అమ్మ ఒడి పథకం జనవరి 9, 2021లో ప్రారంభించబోతున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి కానీ, ఈ 2020 -21 విద్యాసంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా చాలా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ క్రమంలో 2020 -21 విద్యా సంవత్సరానికి సంబంధించి 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం సడలించింది. అంటే, ఈ ఏడాది స్కూల్‌కి వెళ్లినా, వెళ్లకపోయినా అమ్మ ఒడి పథకం కింద డబ్బులనుప్రభుత్వం వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.

దీంతో పాటు మరో గుడ్ న్యూస్ కూడా అందించింది. 2019-20 సంవత్సరంలో పదో తరగతి పాసై, ఆ తర్వాత 2020-21 విద్యా సంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా కాలేజీలు ఓపెన్ చెయ్యకపోవటంతో ఆఫ్ లైన్, ఆన్ లైన్ కానీ చేరలేకపోయిన, లేట్గా చేరిన ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకం కింద డబ్బులు వారి తల్లి ఖాతాలో జమ చేస్తారు. అయితే, ఐఐటీ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ ఎంచుకున్న విద్యార్థులకు మాత్రం మినహాయింపు లేదు. వారు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కిందకు వస్తారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.15,000 చొప్పున అందిస్తారు.

అమ్మఒడి లబ్ధిదారులకు శుభవార్త తెలిపిన జగన్ సర్కార్….!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts