జంతువుల కోసం వంతెన.. మనుషులకు నో ఎంట్రీ..?

December 3, 2020 at 3:07 pm

ఈ మధ్యకాలంలో ఎన్నో జంతువులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలో ఉన్న రహదారుల వెంబడి ఒక వైపు నుంచి మరో వైపు దాటుతున్న సమయంలో అటు నుంచి వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని చివరికి దారుణంగా మృతి చెందుతున్నాయి అడవి జంతువులు. అయితే ఇలా అడవి జంతువులకు ప్రమాదం కలగకుండా ఉండేందుకు అటవీశాఖ అధికారులు కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుని చర్యలు చేపడుతున్నారు ఇటీవలే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అటవీశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదాల రూపంలో ఈ మధ్య కాలంలో తరచూ జంతువులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఇక జంతువుల రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే విధంగా ప్రత్యేకంగా ఒక వంతెన నిర్మించారు అటవీశాఖ అధికారులు. వెదురు, జనపనార, గడ్డి తో కలిపి దాదాపు 40 మీటర్ల ఎత్తులో 90 మీటర్ల పొడవుగల వంతెన నిర్మించారు ఇక ఈ వంతెన ఏకంగా హైవే ఒక వైపు నుంచి మరో వైపు వరకు ఉంది అయితే 40 రోజుల పాటు కష్టపడి ఈ వంతెనను నిర్మించారు అటవీశాఖాధికారులు తద్వారా జంతువుల రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నిర్ణయించారు.

జంతువుల కోసం వంతెన.. మనుషులకు నో ఎంట్రీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts