గ్రేటర్‌ ఫలితాలపై కంగనా ట్వీట్‌..!!

December 4, 2020 at 6:52 pm

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇప్పటి వరకు 40 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచిందంటూ చురకలు పెట్టింది. ఈ సందర్బంగా కంగనా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ప్రియమైన కాంగ్రెస్‌ మీ పార్టీ అధికారంలో పలు రాష్ట్రాల్లో కంగనా కంగనా అంటూ జపం చేస్తుంటే, బీజేపీ మాత్రం తన పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకుంది అంటూ కంగనా కాంగ్రెస్‌ పార్టీకి చురక అంటించారు.

అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తోన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మెల్లగా పుంజుకుంటూ ఆధిక్యంలోకి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ 53 స్థానాలు, బీజేపీ 41 స్థానాలను సొంతం చేసుకుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాలు మాత్రమే సంపాదించింది.

గ్రేటర్‌ ఫలితాలపై కంగనా ట్వీట్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts