కార్తీ గొప్ప మనసు.. రైతులకు మద్దతుగా నిలిచాడు..?

December 4, 2020 at 2:55 pm

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీగా రైతులు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉద్యమ బాట పట్టారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతుల నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం రైతులతో చర్చలు జరిపేందుకు సిద్దం అయింది. క్రమంలోని ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు ప్రకటిస్తున్నారు సినీ హీరో కార్తీ కూడా రైతులకు మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చాడు.

అన్నదాతలు చేస్తున్న ఆందోళనలపై స్పందించి వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలి అంటూ కేంద్రానికి లేఖ రాశారు హీరో కార్తి. కర్షకున్ని కష్టపెట్టకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నారని ఇక ఈ ఆందోళనలో ఎంతోమంది మహిళలు వృద్ధులు కూడా పాల్గొంటున్నారు అంటూ లేఖలో పేర్కొన్నారు కార్తీ. ప్రస్తుతం రైతులు చేస్తున్న ఉద్యమ చారిత్రాత్మక ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించి సమస్యను పరిష్కరించాలి అంటూ కోరారు.

కార్తీ గొప్ప మనసు.. రైతులకు మద్దతుగా నిలిచాడు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts