
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా విడుదల కాకముందే రెండో సినిమాను కూడా పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. స్టార్ దర్శకుడు క్రిష్.. విష్ణవ్ తేజ్ రెండో సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సినిమా అంతా వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగింది. వర్షం వచ్చినా కూడా బ్రేకుల్లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేశారు. ప్రముఖ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన `కొండపొలం` నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి `కొండ పొలం`నే టైటిల్‌గా ఫిక్స్ చేసినట్టు టాక్.
నవల పేరునే ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. కాగా, ఈ సినిమా ద్వారా రకుల్ తొలిసారి డీగ్లామరస్ పాత్రలో కనిపించనుంది.