వైరల్ వీడియో: ఢిపరెంట్‌గా డ్యాన్స్ చేసుకుంటూ పెళ్లి వేదిక పైకి వచ్చిన వధువు…!

December 5, 2020 at 4:52 pm

పెళ్లి వేడుకలో వధువును వేదికపైకి తీసుకు వచ్చే ఘటన చాలా ముఖ్యమయినది. పెళ్లి వేడుకకు హాజరైన అతిథులు అందరు కూడా వధూవరులను వేదికపైకి వచ్చే క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మాములుగా ఇదివరకు రోజుల్లో పెళ్లి కూతురును పెద్దలు వెంట పెట్టుకుని మండపంలోకి తీసుకువచ్చేవారు. కానీ ప్రస్తుతం అన్ని మారిపోయాయి. అయితే మహారాష్ట్రలో ఓ వధువు చాలా ఢిపరెంట్‌గా డ్యాన్స్ చేసుకుంటూ పెళ్లి వేదికకి వచ్చింది.

బాలీవుడ్ హీరోయిన్ సన్నిలియోన్ క్రేజీ సాంగ్‌కు చిందు లేస్తూ వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. మరాఠి సంప్రాదాయంలో ముస్తాబైన వధువు కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టి మండపంలోకి ఖతర్నాక్ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ నుండే సన్నీలియోన్ సాంగ్‌కు డాన్స్ స్టెప్స్ వేస్తూ వేదికకు చేరుకుంది. ఆ పెళ్లికి హాజరైన అతిథులంతా ఆమె ఎంట్రీ ఇంకా డాన్స్ ని అలా చూస్తూ ఉండిపోయారు. ఆమె డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

వైరల్ వీడియో: ఢిపరెంట్‌గా డ్యాన్స్ చేసుకుంటూ పెళ్లి వేదిక పైకి వచ్చిన వధువు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts