మహేష్ బాబు కూతురు సితారకు కోవిడ్ టెస్ట్..!!

December 31, 2020 at 1:09 pm

చివరికి టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితారకి కూడా కరోనా దెబ్బ తప్పలేదు. తాజాగా సితార కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. ఈ సంగతిని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ మధ్య వరసగా తెలుగు స్టార్ హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బీజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూతురు సితార కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ చేస్తున్నపుడు తీసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

నేను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను కొంచెం భయంగా ఉన్నా అమ్మ పక్కనే ఉంది. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాను. చిన్న పిల్లలు ఎవరూ కరోనా వైరస్ కు బయపడోద్దు కరోనా టెస్ట్ చేయించుకోడానికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు అంటూ చెప్పింది సితార. తనని కలిసిన వారు కూడా టెస్టులు చేయించుకోండి అంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సితార. ఇప్పుడు తాజాగా సితార పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

మహేష్ బాబు కూతురు సితారకు కోవిడ్ టెస్ట్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts