
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినప్పటికీ.. కరోనా కారణంగా ఇప్పటి వరకు సెట్స్ మీదకు పోలేదు.
అయితే గత కొద్దిగా త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్ చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు చిత్ర యూనిట్ యూఎస్ షెడ్యూల్ ప్లాన్‌ను మార్చినట్టు తెలుస్తోంది. యూఎస్ లో అనుకున్న షూట్ కు అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల దాన్ని వాయిదా వేసినట్టు టాక్.
ఇక ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ లోని ఒక భారీ సెట్ లో ప్రారంభించనున్నారట. జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టి నిర్విరామంగా నెల రోజుల పాటు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పట్లో యూఎస్ షెడ్యూల్ ఉండదనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో త్వరలోనే తెలియనుంది.