
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి పెద్ద కూతురు, రామ్ చరణ్ సోదరి సుస్మిత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిగ్రీ పొందిన ఆమె.. పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. తన తండ్రి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది.
అలాగే ఇటీవల సుస్మిత నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించిన సుస్మిత.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. దీనికి తండ్రి నుంచి కూడా కావాల్సినంత సపోర్ట్ లభిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి పరవశంలో మునిగితేలుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విష్ణు ప్రసాద్ విషయానికి వస్తే.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసిన ఆయన.. విదేశాల్లో స్టడీ పూర్తయ్యాక తండ్రి వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టడమే కాదు.. మంచిగా సక్సెస్ కూడా అయ్యాడు.