నాకు పూజలు చేయకండి.. ఎందుకంటే..? సోనూ ఆసక్తికర వ్యాఖ్యలు.?

December 1, 2020 at 2:59 pm

కష్టకాలంలో ఆ దేవుడే ప్రజల కష్టాలు తీర్చడానికి వస్తూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు. అయితే కరోనా వైరస్ కష్టకాలంలో మాత్రం దేవుడిలా ముందుకు వచ్చి అందరి కష్టాలు తీరుస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోను సూద్. ఎలాంటి ఫలితం ఆశించకుండానే సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఇప్పటికే ఎంతోమంది నిరుపేదలకు విద్యార్థులకు ముఖ్యంగా వలస కార్మికులకు సోను సూద్ చేసిన సాయం వెలకట్టలేనిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇలా కరోనా వైరస్ కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా మారిపోయిన సోనుసూద్ నూ రోజురోజుకు ప్రజలందరూ ఎంతగానో ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు కొంతమంది ఏకంగా దేవుళ్ళకు పూజలు చేసినట్లుగా సోనూసూద్ ఫోటోకి పూజలు చేస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన సోనుసూద్… తాను ఇలాంటి పూజలు చేయించుకోవడానికి దేవుడిని కాదని ఇలాంటి పూజలకు అర్హుడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

నాకు పూజలు చేయకండి.. ఎందుకంటే..? సోనూ ఆసక్తికర వ్యాఖ్యలు.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts