కేజీఎఫ్-2లో బాలయ్య‌.. ఊహించ‌ని షాక్‌లో ఫ్యాన్స్‌!

December 28, 2020 at 10:04 am

ప్ర‌శాంత్‌ నీల్‌ దర్శకత్వంలో య‌శ్ హీరోగా వచ్చిన పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్ ‘కేజీఎఫ్‌’ ఎంతటి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఈ చిత్రంలో కన్న‌డ సినీ పరిశ్రమ స్థాయిని పెంచ‌డంలో పాటు.. దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందింది. అంతేకాదు, కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అంత‌కంటే ముందు య‌శ్ బ‌ర్త్‌డే సందర్భంగా జనవరి 8 ఉదయం 10.18 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల చేయ‌నున్నారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఈ చిత్రంలో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. సాధార‌ణంగా ఈ రోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ తల్లినే అడుగుతున్నారు.

అలాగే కేజీఎఫ్- 2 కాస్ట్ ఎవరని గూగూల్‌లో సెర్చ్ చేస్తే అందులో నందమూరి బాలకృష్ణ ఫొటో కూడా క‌నిపించ‌డం.. ఆయ‌న అభిమానులు, ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతేకాదు, ఈ చిత్రంలో బాల‌య్య ఇన‌య‌త్ ఖ‌లీల్ అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు కూడా గూగుల్ చూపిస్తోంది. దీంతో ఇప్పుడీ వార్త హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే.. చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

కేజీఎఫ్-2లో బాలయ్య‌.. ఊహించ‌ని షాక్‌లో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts