నయనతార పాత్రలో మరో స్టార్ హీరోయిన్..?

December 1, 2020 at 5:45 pm

ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాల హవా ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే. వివిధ భాషల్లో తెరకెక్కి సుపర్ హిట్ అందుకున్న సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేసి మళ్లీ విజయాన్ని అందుకునేందుకు దర్శకనిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో కూడా ఇలా రీమేక్ సినిమాలు ఎక్కువ విజయం సాధిస్తున్నాయి . అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో కోలమవు కోకిల అనే తమిళ చిత్రం తెరకెక్కింది అనే విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం ఈ సినిమాలో నయనతార పాత్ర లో నటించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను సిద్ధార్థ సేన్ దర్శకత్వం వహించబోతున్నాడని జనవరి నెలలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా ఇది క్రైమ్ కామెడీ కథాంశంతో కూడిన చిత్రం అనే విషయం తెలిసిందే.

నయనతార పాత్రలో మరో స్టార్ హీరోయిన్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts