ఏటీటీ లో అల్లు ఫ్యామిలీ ఉందా….!?

December 1, 2020 at 3:34 pm

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మూవీ థియేటర్లు మూతబడి ఉండటంతో నూతన సినిమాలు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. అయితే ఓటీటీతో పోలీస్తే ఏటీటీ మరీ మంచిది. ఏటీటీ అంటే పే పర్ వ్యూ పద్దతిని ఫాలో అవుతుంది. కానీ సక్సెస్ అయితేనే మంచి లాభాలు వస్తాయి. ఇక ఓటీటీ సంగతి కొస్తే నిర్మాతలకు సినిమా సక్సెస్ తో పనిలేకుండా ఒక నిర్ణీత మొత్తం వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కొందరు ఏటీటీపై మొగ్గు చూపుతునట్టు సమాచారం. ఏటీటీని నిర్మించనున్న నిర్మాత ఎవ్వరో కాదు బన్నీ వాసు అని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నెల 18న బన్నీ వాసు దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు.

బన్నీ వాసు ఏటీటీను ప్రారంభిస్తున్నాడంటే దాని వెనుక కచ్చితంగా అల్లువారి అండ కచ్చితంగా ఉంది ఉంటుంది. ఇప్పుడున్న సమయంలో ఓటీటీలతో పాటుగా ఏటీటీలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్ కన్నా డిజిటల్ పైనే ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతున్నారు. అల్లు అరవింద్ ముందు చూపుతో ఇప్పటికే ఆహా ఓటీటీని మొదలు పెట్టి దూసుకెళ్తున్నారు. అదే విధంగా ఇప్పుడే ఇప్పుడే రాబోతున్న ఏటీటీని కూడా మొదలు పెడితే క్లిక్ అవుతుందని భావించి ప్లాన్ చేస్తున్నారు ఉన్నారు. మరి ప్రేక్షకులు ఏటీటీని ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

ఏటీటీ లో అల్లు ఫ్యామిలీ ఉందా….!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts