
రానున్న క్రిస్మస్ పండుగ సందర్బంగా ఆ ఫ్యామిలీ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకుంది .రెండు రోజులు పని మీద వేరే ఊరు వెళ్లి తిరిగిఇంటికి వచ్చి చూసేసరికి క్రిస్మస్ ట్రీపై అనుకోని అతిథి కనిపించింది. క్రిస్మస్ ట్రీ పై అడవిజంతువును చూసిన యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. వెంటనే దాని వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టారు.
దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ దగ్గరలో కోరమాండల్ వ్యాలీలో ఉంటున్న అమండా మెక్కార్మిక్ తన క్రిస్మస్ చెట్టు పై ఒక కోలా అడవిజంతువు ఉండటం గమనించింది. వెంటనే తన ఫోన్ కెమెరాల్లో దాన్ని వీడియో తీసి, కోలా రెస్క్యూ ఆర్గనైజేషన్ 1300 కోలాజ్కు ఈ సమాచారం అందించింది. వాళ్ళు వచ్చి కోలాని తమతో తీసుకెళ్లారు. క్రిస్మస్ చెట్టుపై అనుకోకుండా వచ్చిన కోలా అతిధి ఉన్న వీడియో క్లిప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలో తెగ హల్చల్ చేస్తుంది.