నేటి నుంచి మారుతున్న రూల్స్ వివరాలు ఇలా…!

December 1, 2020 at 3:50 pm

మన నిత్య జీవితంలో ఉపయోగపడే చాలా అంశాల్లో మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమలు కానున్నాయి.అసలు ఈ రోజు నుండి ఏ రూల్స్ మారనున్నాయి ఒకసారి చూద్దాం. అసలు ఏయే అంశాల్లో మార్పులు వస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరల్ని సవరిస్తుంటాయి. కానీ ఈసారికి మార్పులు లేవని, అదే ధర కొనసాగుతుందని తెలిపింది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి ప్రయోజనం కలగనుంది. భీమా తీసుకున్న 5 ఏళ్ల తర్వాత పాలసీదారులు కావాలనుకుంటే ప్రీమియం మొత్తాన్ని 50 శాతానికి తగ్గించుకోవచ్చు. అంటే సగం ప్రీమియం తోనే మీ పాలసీని కొనసాగించుకోవచ్చు.

డిసెంబర్ 1 నుంచి ఇండియన్ రైల్వేస్ పలు కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం నిబంధనల్ని సవరించింది. ఇకమీదట ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఫోన్ మీ వెంట తప్పక తీసుకెళ్లాలి. రిజిస్టర్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఈ విధానాన్ని పదివేల రూపాయలకు పైబడిన లావాదేవీలకు వర్తింపజేస్తున్నారు ప్రస్తుతం. ఈ రోజు నుండి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల్లో కొన్ని మార్పులు రానున్నాయి. ఇకమీదట ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ ఫర్ సేవలు 365 రోజులు అందుబాటులో ఉంటుంది.

నేటి నుంచి మారుతున్న రూల్స్ వివరాలు ఇలా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts