సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక ఎమోషనల్ పోస్ట్…??

December 2, 2020 at 5:26 pm

ఇప్పటి వరకు తెలుగులో నిహారిక కొణిదెల మూడు చిత్రాలు చేశారు కానీ ఈ మూడు సినిమాలు అనుకున్నంతగా ప్రేక్షకుల్ని ఆక్కట్టుకోలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు భాగానే మెప్పించాయి. ఇది ఇలా ఉంటే నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నాగబాబు తన కుమార్తె పెళ్లికి కావాల్సిన హంగులు అన్నీ పూర్తయ్యాయి. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరుగనుంది.

వీళ్లిద్దరి పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరగనుంది. ఈ వివాహా వేడుకకు మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లనున్నారు. పెళ్ళికి రాలేనివారికి, డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి రిసెప్షన్‌ను ఇవ్వనున్నారు కొణిదెల ఫామిలీ. ఈ తరుణంలో నిహారిక తనకు కాబోయే భర్త చైతన్యతో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టింది. తన పెళ్ళికి ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉందని, కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందంటూ పెట్టారు. ఈ ఫోటోల్లో నిహారిక చైతన్యలు చాలా లవ్లీ గా కనిపించరు. ఈ ఫోటోను చూసిన అందరు వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక ఎమోషనల్ పోస్ట్…??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts