
మెగాఫ్యామిలీ అంతా నిహారిక పెళ్లి వేడుకలో సందడి చేయనున్నారు. డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా నిహారిక చైతన్యల పెళ్లి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ దద్దపుగా అన్ని పూర్తి కాగా, మరో రెండు రోజులలో ఫ్యామిలీ అంతా అక్కడకి రానున్నారు. ప్రస్తుతం నిహారిక మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలతో అక్కడ పెళ్లి వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది.
కొద్ది రోజులుగా నుండి నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ వాటికీ సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా నాగబాబు కుమార్తె నిహారికని పెళ్లి కూతురు కార్యక్రమం కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫొటోస్ చుసిన నెటిజన్స్ అంతా పెళ్లి కూతురుగా నిహారిక చాలా
కళగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.