
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో `రంగ్ దే` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో `ఛెక్` మరియు అందాదున్ తెలుగు రీమేక్ లో నితిన్ నటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రముఖ కార్పోరేట్ బ్రాండ్‌కు తాను ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్టు కొన్ని నెలల క్రితం నితిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, ఈ యంగ్ హీరో ఆ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం యాడ్ షూట్ లో కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు చూసి.. అందరూ నితిన్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నారని అనుకున్నారు. కానీ, నితిన్ చేసిన యాడ్ షూట్ హైదరాబాద్ కి చెందిన స్నేహ చికెన్ బ్రాండ్ కోసం అని తాజాగా ‘స్నేహ చికెన్ – ది చికెన్ ఆంథమ్’ అనే పేరుతో విడుదలైన ఆ యాడ్ ద్వారా తెలిసింది.
ఈ యాడ్ లో నితిన్ తల్లిగా సీనియర్ నటి ప్రగతి కనిపించారు. ‘ఈ అమ్మలెప్పుడూ ఇంతేనండీ. మనం ఎక్కడున్నా ఒక్కటే ప్రశ్న. తిన్నావా? అని. ఆ ప్రశ్నకు సమాధానం స్నేహా చికెన్ అయితే ప్రతి అమ్మకి పండగే’ అంటూ స్నేహా చికెన్‌కు నితిన్ ప్రచారం చేశాడు. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన యాడ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.