ప‌వ‌న్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అల్లు అర్జున్ మర‌ద‌లు?

December 4, 2020 at 9:00 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం `వ‌కీల్ సాబ్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంతో పాటుగా మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌లో కూడా ప‌వ‌న్ న‌టించ‌నున్నారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.

మిలటరీ ఆఫీసర్, పోలీసాఫీసర్‌ల మధ్య జరిగే ఈ కథ మ‌ళ‌యాళ‌ ప్రేక్షకులను బాగానే కట్టిపడేసింది. ఇక ఆ రెండు పాత్ర‌ల్లో ఒక‌టి ప‌వ‌న్ చేయ‌నుండ‌గా.. మ‌రో పాత్ర‌లో రానా పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మ‌ర‌ద‌లు హీరోయిన్ ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. ఇక అల్లు అర్జున్ మ‌ర‌ద‌లు ఎవ‌ర‌బ్బా అనేగా మీ సందేహం?.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల వైకుంఠ‌పురుములో చిత్రంలో బ‌న్నీ మ‌ర‌ద‌లి పాత్రలో హాట్‌గా కనిపించి అదరగొట్టిన నివేధా పేతురాజ్.

`మెంటల్ మది` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సాయి ధ‌ర‌మ్ తేజ్ `చిత్ర లహరి`, `బ్రోచేవారేవరురా..` లో కూడా నటించి మెప్పించింది. మ‌రోవైపు త‌మిళంలోనూ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ చిత్రంలో ఈ అమ్మ‌డు బంప‌ర్ ఛాన్స్ అందుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే.. చిత్ర‌యూనిట్ స్పందించాల్సిందే.

ప‌వ‌న్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అల్లు అర్జున్ మర‌ద‌లు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts