
ఇకమీదట ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్‌ను ధరించాలనే నిబంధనలను కలకత్తా పోలీసులు మరింత కఠినతరం చేశారు. ఇకనుండి ద్విచక్ర వాహనం నడిపే వారు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వెళ్ళితే వారికి పెట్రోల్ ఇవ్వకూడదని కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఈ నిబంధన డిసెంబర్ 8 నుండి అమల్లోకి రానుంది. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లోకి వచ్చిన వాహనదారులకు నో పెట్రోల్. ఈ నిబంధన కలకత్తా నగర పరిధిలోకి వచ్చే అన్ని పెట్రోల్ బంకులో వర్తిస్తుంది.
ఇంకా బైక్ మీద ఇద్దరు వ్యక్తులుంటే వారిద్దరికీ హెల్మెట్ తప్పనిసరి. ఇద్దరు హెల్మెట్ ధరించి ఉంటేనే పెట్రోల్ పోయాలి అంటూ పోలీసు శాఖ వారు ప్రకటన రిలీజ్ చేసింది. హెల్మెట్లు కచ్చితంగా ధరించాలి అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఒకవేళ హెల్మెట్ కొనుక్కోలేని పరిస్థితి ఉన్న ప్రజలు తమ స్థానిక పోలీసు స్టేషన్లో నమోదు చేసుకుంటే వారికి ప్రభుత్వం నుండే ఉచితంగా హెల్మెట్ లభిస్తుందని ఆమె వెల్లడించారు.