
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అయిన కోరీ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 29 వయసు ఉన్న కోరీ ఆండర్సన్ న్యూజిలాండ్ క్రికెట్‌ను విడిచి పెడ్తున్నట్లు ప్రకటించాడు. అమెరికాలో ఎంఎల్సీ – మేజర్ లీగ్ క్రికెట్ టీ20తో మూడేళ్లు పాటు అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. వన్డే మ్యాచ్ ల్లో అత్యంత వేగంగా 36 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వ్యక్తి కోరీ ఆండర్సన్.
2014 సంవత్సరంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఆండర్సన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫును కూడా ఆడారు. 2018 ఏడాదిలో కివీస్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు కోరీ ఆండర్సన్. ఎంఎల్సీ టీ20 లీగ్‌తో పాకిస్థాన్‌కు చెందిన సామీ అస్లాం, సౌతాఫ్రికాకు చెందిన డేన్ పైట్ తదితరులు పై ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు ఆండర్సన్.