జనవరి 1 నా ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందా…!?

December 4, 2020 at 7:57 pm

టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరో హీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో, శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఒరేయ్‌ బుజ్జిగా. ఈ సినిమాని నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న మూవీ థియేట‌ర్స్ లో రిలీజ్ కానుంది.

మూవీ నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ 2021 సంవత్సరంకి ఆహ్వానం ప‌లుకుతూ న్యూ ఇయర్ కానుక‌గా హీరో రాజ్‌ తరుణ్, హీరోయిన్స్ మాళవిక నాయర్, హెబా ప‌టేల్ ‌ నటించిన ఫన్నీ ఎంట‌ర్‌టైన‌ర్ ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు తెలిపారు. ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ అందించారు. ఓటిటి లో విజయం సాధించిన ఒరేయ్ బుజ్జిగా చిత్రం జనవరి 1 నుండి మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.

జనవరి 1 నా ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts