
దాదాపు మూడేళ్ల తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా హిందీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కతోంది. హిందీ లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర తెలుగులో పవన్ కళ్యాణ్ చేయనున్నారు. ఈ చిత్రంలో పవన్ లాయర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాపై అటు పవన్ అభిమానులకి ఇంకా సినిమా ప్రియులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకు ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా ప్రజల ముందుకు రానున్నట్లు చిత్రం వారు ప్రకటించారు.
కానీ ప్రస్తుతం తాజాగా వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ సినిమా సంక్రాంతి పోరును నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం చాలా సార్లు వాయిదా పడుతూ చాలా ఆలస్యం అయింది. మొదట లాక్డౌన్ కారణంగా, ఆ తరువత రాజకీయలలో పవన్ బిజీ అవ్వడం ఇలా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే సంక్రాంతి పోరు నుంచి తప్పుకున్న వకీల్ సాబ్ ఎప్పుడు కోర్టుకు రానునట్లు అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. సంక్రాంతి బారి నుండి తప్పుకుని, ఉగాది పోరులో వకీల్ సాబ్ తలపడనున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికీ దీని పై ఎలాంటి ప్రకటన రాలేదు.