పెళ్లయిన మూడునెలలకే వధువు ఆత్మహత్య..?

December 4, 2020 at 6:02 pm

ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది చిన్నచిన్న కారణాలకే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఎంతో విలువైన ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం లోకి అడుగుపెట్టిన వధువు ఏకంగా మూడు నెలలు తిరగక ముందే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కుటుంబంతో తీరని విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ ప్రాంతంలో రాఘవేంద్ర అనే వ్యక్తి సుకన్య అనే యువతిని మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే రాఘవేంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. సుకన్య ఇంట్లోనే ఉంటూ ఉండేది. అయితే ఇటీవలే రాఘవేంద్ర కంపెనీకి డ్యూటీ నిమిత్తం వెళ్ళిన సమయంలో సుఖన్య ఏకంగా ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుంది ఇక రాఘవేంద్ర ఇంటికి వచ్చి తలుపులు తెరిచే సరికి విగతజీవిగా వేలాడుతూ ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లయిన మూడునెలలకే వధువు ఆత్మహత్య..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts