
సాధారణంగా కలర్ బబుల్స్ అంటే పిల్లలకు విపరీతమయిన ఇష్టం. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా కలర్ బబుల్స్‌ను అందరు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదివరకు సబ్బు నురగతో తయారు చేసిన బబుల్స్‌తో ఆడుకునేవాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడు వచ్చే కలర్ బబుల్స్ శరీరానికి అంతగా హాని చేయని రసాయనాలతో తయారు చేసిన ద్రావకాలు మార్కెట్లోకి అనేకం ఉన్నాయి. చిన్న గొట్టం వంటి పరికరంతో ద్రావకాన్ని తీసుకుని ఊదితే చాలు రంగు రంగుల బబుల్స్ వస్తాయి.
మరి అలాంటి కలర్ బబుల్స్‌తో పెంగ్విన్లు ఆడుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఓరెగాన్ జూ నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కలర్ బబుల్స్‌ను పట్టుకుని పగలకొట్టేందుకు పెంగ్విన్లు ఆరాట పడుతుంటే చూడటానికి భలే సరదాగా అనిపిస్తుంది. అయితే మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి.