వైరల్ వీడియో : హైవేపై ల్యాండ్ అయిన విమానం…!

December 5, 2020 at 3:03 pm

డిసెంబర్ 2న అమెరికాలో ఓ విమానం ఏకంగా హైవేపై ల్యాండ్ అయిన సంఘటన చోటు చేసుకుంది. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. అసలు ఏమి జరిగిందంటే, అమెరికాలో మిన్నసోటాలోని హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నటైంలో అనుకోకుండా అకస్మాత్తుగా ఓ విమానం అత్యవసర లాండింగ్ అయ్యింది. ఈ సమయంలో ఆ విమానం ఒక కారును ఢీ కొట్టింది. కానీ ఈ ప్రమాదంలో ఎవరీకి ఎలాంటి గాయాలు కాలేదు.

కారు యజమానికి విమానం నడిపిన ఫైలెట్ క్షమాపణలు చెప్పి, పరిస్థితి వివరించారు. విమానంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా హైవేపై ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందంటూ ఫైలెట్ చెప్పారు. విమానం హైవేపై ల్యాండ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు అన్ని రికార్డు అయ్యాయి. ఆ వీడియోను ఆ రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ అధికారులు నెట్టింట్లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో : హైవేపై ల్యాండ్ అయిన విమానం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts