ఈ సంవత్సరంలో ప్లే స్టోర్ లో బెస్ట్ యాప్ ఏమిటంటే…!?

December 1, 2020 at 4:00 pm

ఈ సంవత్సరం 2020 గూగుల్ ప్లే స్టోర్‌ బెస్ట్ యాప్‌గా ఇండియ‌న్ స్టార్ట‌ప్ వైసాకు చెందిన మెడిటేష‌న్ యాప్ నిలిచింది. ఈ యాప్ పేరు స్లీప్ స్టోరీస్ ఫ‌ర్ కామ్ స్లీప్ మెడిటేట్ విత్ వైసా. మంచి నిద్ర పొందడం కోసం వైసా వారు ఈ యాప్ విడుదల చేసింది. చాలా వినూత్న‌మైన ఈ యాప్ ఈ ఏడాది తమను బాగా ఆక‌ట్టుకున్న‌ద‌ని త‌న అవార్డుల పేజీలో గూగుల్ మెచ్చుకుంది. మానవ మెద‌డుకు విశ్రాంతి నిచ్చి, హాయిగా నిద్ర‌ప‌ట్టేలా అవ‌స‌ర‌మైన టూల్స్‌, ఎక్సర్‌సైజులు ఈ యాప్‌లో ఉంటాయి.

ఇంకా అవ‌స‌ర‌మైతే స్లీప్ థెర‌పిస్ట్‌తో వ‌న్ ఆన్ వ‌న్ సెష‌న్ కూడా పొందవచ్చు. భార‌త పారిశ్రామిక‌వేత్త జో అగ‌ర్వాల్ ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ఇదే కాకుండా చాట్‌బోట్ మోడ‌ల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను కూడా అభివృద్ధి చేసే పనిలో వైసా ఉంది. క‌రోనా వైరస్ కారణంగా చాలా మంది మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటు ఇబ్బంది పడ్తున్నారు. అలాంటి వాళ్ల కోసం ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది వారు తెలిపారు.

ఈ సంవత్సరంలో ప్లే స్టోర్ లో బెస్ట్ యాప్ ఏమిటంటే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts