మ‌రో బంప‌ర్ అఫ‌ర్ కొ‌ట్టేసిన పూజాహెగ్డే.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్?

December 3, 2020 at 7:19 am

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో సూప‌ర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం. ప్రభాస్ రాధే శ్యామ్.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్ కూడా చేస్తోంది.

అయితే తాజాగా ఈ అమ్మ‌డు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు మలయాళ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌. ఇప్పుడు మరో స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయనున్నారు. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఈ సినిమాను తెలుగు, మలయాళంలో తెరకెక్కించనున్నారు.

భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇందులో దుల్కర్‌కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టించేందుకు పూజా ఏకంగా రెండున్నర కోట్లు తీసుకుంటుందని టాక్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం పూజా రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రో బంప‌ర్ అఫ‌ర్ కొ‌ట్టేసిన పూజాహెగ్డే.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts