
ప్రస్తుతం పూజా హిగ్దే రెండు సినిమాలతో బిజీ గా ఉన్న స్టార్ హీరోయిన్. వాటిలో ఒకటి పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్, మరొకటి యువ హీరో అక్కినేని అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తోంది ఈ అందాల భామ. వీటిలో రాధే శ్యామ్ చిత్రం పీరియాడిక్ ప్రేమకథగా రూపొందుతోంది. అయితే ఈ అందాల భామ ఇప్పుడు మరో లవ్‌స్టోరీ చేసేందుకు అవకాశం వచ్చిందట.
దుల్కర్ సల్మాన్ హీరోగా, రాఘపుడి దర్శకత్వంలో మరో పీరియాడిక్ లవ్ స్టోరీ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి పేరు ఇంకా పెట్టలేదు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు కావాలంట. దానిలో మెయిన్ హీరోయిన్గా పూజా హిగ్దేను ఎంపిక చేసినట్లు మీడియా వర్గాల టాక్. ఈ చిత్రానికి పూజా ఏకంగా రూ.2.5కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. చూడాలి చివరికి హీరో దుల్కర్ సల్మాన్ సరసన మన అందాల భామ జత కడ్తుందో లేదో.