ప్రభాస్ అసలు ప్లాన్ అదేనా.. అందుకే ఇలా చేస్తున్నాడు..?

December 3, 2020 at 3:21 pm

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఏకంగా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్పీడ్ పెంచాడు అన్న విషయం తెలిసిందే. వరుసగా సినిమాలకు ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యాం అనే సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగియకముందే… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక అంతలోనే ఆది పురుష అనే భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓకే చేశాడు.

ఇక ఇటీవలే ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించబోయే సలార్ అనే సినిమాకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలకు ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం. అయితే అన్ని సినిమాలను ఎంతో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభాస్ ఇలా వరుస సినిమాలు ఓకే చేస్తూ పోతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ అసలు ప్లాన్ అదేనా.. అందుకే ఇలా చేస్తున్నాడు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts