జాంబిలకు, కరోనా వైరస్ కు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..!?

December 5, 2020 at 4:03 pm

అసలు జాంబీలకు, కరోనా వైరస్‌కు సంబంధం ఏంటి.. మరి ఆ విషయాలన్ని తెలుసుకోవాలంటే తన చిత్రం చూడాల్సిందే అంటున్నాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. మనిషి మేధస్సుని ప్రశ్నించేలా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తోన్న సినిమా జాంబీరెడ్డి. అ!, కల్కి సినిమాలు తర్వాత ప్రశాంత్‌ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇది. త్వరలోనే ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రానుంది. ఈ సినిమా కథకు కరోనా వైరస్‌ లింకు పెడుతూ ప్రశాంత్‌ వర్మ సినిమాను తెరకెక్కించడం ఇక్కడ మరో విశేషం.

మరింత ఆసక్తికరమైన సంగతి ఏంటంటే కరోనా వైరస్‌ ప్రభావం మొదలు కాక ముందే డైరెక్టర్‌ ఈ కథతో సినిమాను మొదలు పెట్టడం. అసలు వాస్తవానికి జాంజీలకు, కరోనా వైరస్‌కు ఉన్న లింకు ఏమిటి అనేది తెలియాలంటే తమ చిత్రం తప్పాకా చూడాల్సిందే అంటున్నారు డైరెక్టర్ ప్రశాంత్. రీసెంట్‌గా రిలీజ్ అయిన జాంబీరెడ్డి ఫస్ట్‌ బైట్‌ చాలా ఆసక్తికరంగా ఉండటంతో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి సినిమా చూస్తే కానీ అసలు సంగతి ఏంటో తెలియదు.

జాంబిలకు, కరోనా వైరస్ కు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts