భీష్మా డైరెక్టర్‌కు ఎస్ చెప్పిన ప్రిన్స్ మహేశ్..!!

December 7, 2020 at 5:26 pm

కరోనా ముందు విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో భీష్మా ఒకటి. ఈ చిత్రంతో అటు హీరో నితిన్ ఇంకా దర్శకుడుకి కూడా మంచి పేరు సంపాదించారు. బీష్మ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది. తాజాగా ఈ దర్శకుడు మరో కథను సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు‌కు వినిపించాడు. కథ చాలా నచ్చడంతో ఎటువంటి ఆలస్యం చేయకుండా మహేష్ పచ్చజెండా ఊపాడట. దర్శకుడు చెప్పిన లైన్ నచ్చి, మొత్తం స్క్రిప్ట్‌ ప్రిపేర్ చేసి తీసుకొని రమ్మనారట.

దాంతో వెంకీ తన కొత్త కథకు స్క్రిప్ట్‌ను పూర్తి చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరీలో షూటింగ్ మొదలు కానుంది. మరి దర్శకుడు వెంకీ ఇంకా హీరో మహేష్ బాబు కాంబినేషన్లోసినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.

భీష్మా డైరెక్టర్‌కు ఎస్ చెప్పిన ప్రిన్స్ మహేశ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts