రైతుల సమస్యలు పరిష్కరించడం నా చేతుల్లో లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు..!

December 3, 2020 at 5:23 pm

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం పంజాబ్ రైతులందరూ ఉద్యమబాట పట్టి రోడ్డెక్కి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ క్రమంలోనే ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతుల మధ్య చర్చలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. తాజాగా జరుగుతున్న పరిణామాల పై స్పందించిన పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతుల యొక్క అభ్యంతరాలు అన్నింటినీ కూడా తాను హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాను అంటూ చెప్పుకొచ్చారు అమరేందర్ సింగ్. ఇక రైతులు సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం చేతిలోనే ఉందని .. తన చేతిలో ఏమీ లేదని.. కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలి అంటూ కోరారు. అయితే ప్రస్తుతం రైతులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్.

రైతుల సమస్యలు పరిష్కరించడం నా చేతుల్లో లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts