
ఇటీవలే తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది రైతులు చేతికొచ్చిన పంట నష్ట పోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తిరుపతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వెంటనే ప్రభుత్వం రైతులకు 35 వేల పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలను ప్రభుత్వం తీర్చాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే రైతులకు మేలు జరిగే అందుకే కేంద్ర వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక రైతుల కోసం త్వరలో జైకిసాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.