రకుల్ 2 సినిమాలు ఓటీటీ కే పరిమితమా..?

December 1, 2020 at 3:09 pm

మొన్నటి వరకూ టాలీవుడ్లో అవకాశాలు లేక బాలీవుడ్ పై కన్నేసిన రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ వరుస అవకాశాలు అందుకుంటూ ఉండడంతో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఓ వైపు బాలీవుడ్లో మరో వైపు టాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ మెగాహీరో వైష్ణవ్ తేజ్ సరసన కూడా ఓ సినిమా చేస్తోంది బాలీవుడ్ లో కూడా జాన్ అబ్రహం అర్జున్ కపూర్ అమితాబ్ బచ్చన్ తో కూడా ఓ సినిమా చేస్తోంది.

ఇక ప్రస్తుతం రకుల్ చేస్తున్న ఆయా సినిమాలకు సంబంధించిన షూటింగ్ లలో కూడా పాల్గొంటుంది అయితే రకుల్ చేస్తున్న పలు సినిమాలు ప్రస్తుతం ఓటిటి కి పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తోపాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ సినిమా కూడా ఓటిటి లోనే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అర్జున్ కపూర్ తో నటిస్తున్న సినిమా కూడా ఓటిటి కి పరిమితం అవుతుందట. దీంతో పెద్ద తెరపై రకుల్ అందాలను చూడాలి అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

రకుల్ 2 సినిమాలు ఓటీటీ కే పరిమితమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts