రామ్ నెక్స్ట్ మూవీ వెంకీతోనా..?

December 23, 2020 at 7:33 pm

ఇస్మార్ట్ శంకర్‌గా అలరించిన రామ్ దాని తరువాత ఒక్క మూవీ కూడా రిలీజ్ చేయలేదు. రామ్ నటించిన రెడ్ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడి వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధం అవుతోంది. ఇప్పుడు రామ్ రెడ్ తరువాత ఏ మూవీ చేస్తాడని సినీ వర్గాలు బాగా చర్చించుకుంటున్నాయి. కానీ రామ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మెప్పించునున్నాడని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం వస్తున్న సినీ వర్గాల టాక్ ప్రకారం రామ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాకుండా అతడి శిష్యుడు వెంకీ కుడుములతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

రామ్ తన నెక్స్ట్ సినిమాను వెంకీ దర్వకత్వంలో చేస్తున్నాడని, దానికి మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ ఇస్తునాట్లు వినికిడి. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లేదా సితారా ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించనున్నాయట. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మరి మన ఎనర్జిటిక్ హీరో రామ్ తన నెక్స్ట్ సినిమా కోసం ఏ దర్శకుడిని ఎంచుకుంటాడో వేచి చూడాలి.

రామ్ నెక్స్ట్ మూవీ వెంకీతోనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts