రాష్ట్రం వాళ్ళ జాగిరి కాదు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

December 4, 2020 at 2:49 pm

ఇటీవలే నివర్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులను పరామర్శించేందుకు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఇటీవల నెల్లూరు జిల్లాలో పర్యటించారు అన్న విషయం తెలిసిందే. ఇక నెల్లూరు జిల్లా పర్యటన కోసం పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ప్రస్తుతం గూడూరు రహదారిపై సర్కిల్ వద్ద అభిమానులు జనసైనికులు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రైతులను పరామర్శించి భరోసా చెప్పడానికి వస్తే వైసిపి నాయకులు అడ్డుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నను పరామర్శించేందుకు వచ్చిన నన్ను అడ్డుకోవడం సరైంది కాదు అంటూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసిపి జాగిరి కాదు అంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. వరదల కారణంగా భారీగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రైతుల తరపున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రం వాళ్ళ జాగిరి కాదు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts