ఆర్జీవీ కరోనా వైరస్‌.. రెండో ట్రైలర్‌!!

December 2, 2020 at 2:19 pm

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో అన్ని సినిమా షూటింగ్‌లు ఆగిపోయినప్పటికీ దర్శకుడు రామ్‌గోపాల్‌​ వర్మ మాత్రం పలు సినిమాలను తెరకెక్కించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే మూవీ షూటింగ్‌లను పూ​ర్తి చేసి రిలీజ్ కూడా చేశారు. ఆఖరికి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై కూడా ఆర్జీవీ ఓ మూవీ నిర్మించారు. ఆ చిత్రానికి ఏకంగా కరోనా వైరస్ అని పేరు పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న కరోనా వైరస్‌ సినిమా రెండో ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రానికి ఆగస్త్య మంజు దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మొదటి ట్రైలర్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇక పోతే రెండో ట్రైలర్ లో తీవ్రమైన దగ్గు శబ్దంతో కూడిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ మూవీ పై మరింత ఆసక్తి పెంచుతోంది. ఇకపోతే కరోనా వైరస్‌ చిత్రాన్ని డిసెంబర్‌ 11న రిలీజ్ కానుంది. లాక్‌డౌన్‌ అనంతరం మూవీ థియేటర్‌లో విడుదల అవుతున్న మొదటి చిత్రం తమ సినిమానే అని రామ్‌గోపాల​ వర్మ పేర్కొన్నారు.

ఆర్జీవీ కరోనా వైరస్‌.. రెండో ట్రైలర్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts