థియేటర్లు రీఓపెన్‌.. సినిమాకు వెళ్లిన మెగా హీరో: వీడియో వైర‌ల్‌

December 4, 2020 at 2:08 pm

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎంత వ‌దిలించుకుందామ‌న్నా.. వ‌ద‌ల‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా వినోదం కూడా ఆగిపోయింది. సినిమా షూటింగ్లు, థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి

ఇక ఇటీవ‌ల కేంద్రం లాక్‌డౌన్ ఎత్తేయ‌డంతో.. మ‌ళ్లీ షూటింగ్లు ప్రారంభం అవుతున్నాయి. మ‌రోవైపు థియేట‌ర్ల‌ను కూడా రీఓపెన్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం అనుమ‌తితో నేటి నుంచి మ‌ళ్లీ థియేటర్లు తెరుచుకున్నారు. ఈ క్ర‌మంలోనే మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తన స్నేహితులతో కలిసి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వెళ్లి హాలీవుడ్ సినిమా ‘టెనెట్‌’ చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో మొద‌ట‌ సాయి తేజ్ ఇంటి నుంచి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కు వెళ్ల‌డం.. చేతులు శానిటైజ్ చేసుకోవ‌డం ఇలా అన్ని చూపించారు. ఈ క్ర‌మంలోనే చాలాకాలం తర్వాత థియేటర్‌కు రావడం సంతోషంగా ఉందని, వెండితెరపై సినిమాని చూడడమే అద్భుతమైన వినోదమని సాయి తేజ్ పేర్కొన్నాడు. ఇక ప్రతి ఒక్కరూ తిరిగి థియేటర్లకు రావాలని .. అయితే, థియేటర్‌కు వచ్చేముందు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలని ఆయ‌న కోరారు. ప్ర‌స్తుతం సాయి తేజ్ పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

థియేటర్లు రీఓపెన్‌.. సినిమాకు వెళ్లిన మెగా హీరో: వీడియో వైర‌ల్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts