సైనిక విధుల్లో చేరిన రానా..?

December 3, 2020 at 3:01 pm

ఈ మధ్య కాలంలో హీరోలు రియల్ లైఫ్ అడ్వెంచర్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే ఇక ఇటీవల టాలీవుడ్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రానా రియల్ లైఫ్ అడ్వెంచర్ చేసి అభిమానులను ఆశ్చర్య పరిచాడు. ఇటీవలే ఏకంగా భారత సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ జవాన్ అవతారం ఎత్తిన రానా సరిహద్దుల్లో ఒకరోజు పాటు దేశానికి పహారా కాస్తూ గడిపాడు. దీనికి సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు నటుడు రానా.

డిస్కవరీ ప్లస్ అనే ఫ్రంట్లైన్ కార్యక్రమం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లు అవతారం ఎత్తిన రానా 24 గంటలపాటు అక్కడే సరిహద్దుల్లో జైసల్మేర్ ప్రాంతంలో పహారా కాసాడు. దీనికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఇది తన ఐదవ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చాడు నటుడు రానా. తనకు ఇలాంటి అరుదైన అవకాశాన్ని కల్పించిన డిస్కవరీ ప్లస్ కు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.

సైనిక విధుల్లో చేరిన రానా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts