విభిన్న పాత్రలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సత్య దేవ్…!?

December 5, 2020 at 6:30 pm

టాలీవుడ్ లో విభిన్న పాత్రలు చేస్తూ తన నటనతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన సినిమాలు బ్రోచేవారెవరు రా, బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చూస్తే అన్ని విబ్భినమయిన కధాంశాలతో సాగే సినిమాలే. ఈ సినిమాలతో టాలెంటెడ్ యాక్టర్ అని నిరూపించుకున్నారు సత్యదేవ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా తిమ్మరుసు. ఈ సినిమాకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరో సత్యదేవ్ జతగా ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న తిమ్మరుసు మూవీ ఫస్ట్ లుక్ ను శనివారం నాడు సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.

తిమ్మరుసు మూవీ ఫస్ట్ లుక్ లో హీరో సత్యదేవ్ బైక్ పై కూర్చుని, చేతిలో సూట్ కేస్ పట్టుకొని చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలాయి.సినిమాకి సంబందించిన ఇతర విషయాలు త్వరలో తెలియజేస్తాం అని మూవీ యూనిట్ తెలిపారు. ఫ‌స్ట్ లుక్‌లో హీరో స‌త్య‌దేవ్ బుల్లెట్‌పై కూర్చొని చాలా సీరియ‌స్‌ లుక్స్ తో క‌నిపిస్తున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తున ఈ సినిమాలో స‌త్యదేవ్‌ను సరికొత్త కోణంలో చూడబోతారు అంటున్నారు దర్శకుడు.

విభిన్న పాత్రలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సత్య దేవ్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts