
యువ హీరో సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సత్యదేవ్ మరో కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధం అయ్యారు. అదే `తిమ్మరుసు`. అసైన్ మెంట్ వాలి అనేది ట్యాగ్ లైన్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై శ్రుజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో సత్యదేవ్ చేతిలో ఓ సూట్ కేస్ పట్టుకొని బైక్ పై కూర్చుని స్టైలిష్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ఇక డిసెంబర్ 9న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. కాగా, విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా, బ్రహ్మాజీ, రవిబాబు, అజయ్, ప్రవీణ్, అంకిత్ కొయ్య, కేజీఎఫ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.