వైరల్ అవుతున్న షారుఖ్‌ న్యూ లుక్‌..!!

December 2, 2020 at 3:19 pm

బాలీవుడ్‌ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ చాలాకాలం పాటు సినిమాలకు దూరమయ్యాడు. జీరో సినిమా పరాజయం పాలయ్యాక షారుఖ్ వెండితెరకు బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమా వల్ల తన అభిమానులను ఎంతగానో నిరాశపరచటంతో ఈ సారి భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మాణంలో, సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరెకెక్కనున్న పఠాన్‌ మూవీతో ఈ సారి బాక్స్ ఆఫీస్ హిట్‌ కొట్టాలని ఉన్నాడు షారుఖ్.

ఈ సిని​మాను ఇప్పటికే సెట్స్‌ పైకి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్బంగా షారుక్‌ సరికొత్త లుక్స్ తో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముంబైలోని యష్ రాజ్ స్టూడియోలో షారుఖ్ ఖాన్ సరికొత్త లుక్ తో కనిపించాడు. పొడవాటి జుట్టు, హెయిర్‌ బ్యాండ్‌, గడ్డంతో ఉన్న బాద్‌షా ‌ న్యూలుక్‌ అభిమానులకు బాగా నచ్చుతుంది.

వైరల్ అవుతున్న షారుఖ్‌ న్యూ లుక్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts